Harish Rao | కాంగ్రెస్ సర్కార్ అలసత్వంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు: హరీశ్ రావు
కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్ వెళ్లడంతో సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదిలారని చెప్పారు. ఇ
సిద్దిపేట: కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్ వెళ్లడంతో సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదిలారని చెప్పారు. ఇప్పుడు కరీంనగర్ వస్తున్నారని ఎస్సారెస్పీ కాలువకు నీళ్లిచ్చారని తెలిపారు. రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్‌కు హరీశ్ రావు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నీరు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కార్ అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లున్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని చెప్పారు.
మల్లన్నసాగర్లో నీళ్లున్నా.. ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. కూడవెళ్లి వాగుకు 24 గంటల్లోగా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మంది రైతులతో మల్లన్న సాగర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే తామే మల్లన్నసాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలన్నారు. కూడవెల్లి వాగు పరిధిలో 10 వేల ఎకరాలు ఎండిపోయాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. దీనిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నాని, కాంగ్రెస్ పార్టీ తరుపున చర్చకు ఎవరొస్తారో రావాలన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇచ్చి, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేలు ఇచ్చి భట్టి విక్రమార్క తన చిత్తశుద్ధిని చూపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు
-
-
- తక్షణం కాలువలు, చెరువుల కింద ఉన్న పంలకు నీటిని విడుదల చేయాలి. ఇంకా 2-3 తడులకు నీళ్లు అందిస్తే రైతులకు ఉపయోగం.
- వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. త్రీ ఫేజ్ ఉండేలా చూడాలి.
- ఎండిన పంటలకు సంబంధించి ఎన్యుమరేషన్ చేయించి రైతులకు ఎకరానికి రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి.
- రాష్ట్రంలో ఈ యాసంగికి నీటి సమస్యతో దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
- ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలి.
- కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి రైతులు తీసుకువచ్చే ప్రతీ గింజను కొనుగోలు చేయాలి.
- ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ తక్షణం చేయాలి.
- రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి.
- రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలి.
- వడగల్ల వర్షం ద్వారా పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి, వారిని ఆదుకోవాలి.
Live: సిద్దిపేట కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/AuwXOt1t4D
— BRS Party (@BRSparty) April 2, 2024
-
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

