Harish Rao | ఆ 39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి..: హరీశ్‌రావు
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోనప్పుడు, ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులను సహచర పోలీసులే అరెస్ట్ చేసినప్పుడు, పోలీసులు ఏమి చేయాలని ప్రశ్నించారు.
హైదరాబాద్: బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోనప్పుడు, ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులను సహచర పోలీసులే అరెస్ట్ చేసినప్పుడు, పోలీసులు ఏమి చేయాలని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో వారి సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈమేరకు డిజీపీ జితేందర్‌ను హరీశ్ రావు కోరారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే శనివారం బెటాలియన్లలో ఆందోళనలు నిర్వహించిన కానిస్టేబుళ్లపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. క్షమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తూ 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని హరీశ్ రావు డీజీపీని కోరారు. మరోవైపు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

