Naveen Kumar Reddy | నవీన్‌కుమార్ రెడ్డికి హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు..
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్‌కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్‌కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మార్చి 28న ఎన్నికలు జరుగగా, ఆదివారం ఉదయం ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో నవీన్ కుమార్ మొదటి ప్రాధాన్య ఓట్లతోనే కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1,437 ఓట్లు పోలవగా బీఆర్ఎస్కు 763, కాంగ్రెస్‌కు 652, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు చొప్పున వచ్చాయి. మరో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
నవీన్‌కుమార్ విజయంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.. నీవన్కుమార్ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన @BRSparty అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.
గెలుపుకు కృషి చేసిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/6ZWaoUZFxV
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

