Harish Rao | సమస్యల వలయంలో గురుకులాలు.. చీమకుట్టినట్లైనా లేని ప్రభుత్వం: హరీశ్‌రావు
రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పారిశుద్ధ్య నిర్వహణ లేక, టాయిలెట్స్, అవసరమైన సిబ్బంది లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర యంత్రాలు, పనిముట్లు పనిచేయడం లేదన్నారు. దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారని వెల్లడించారు. కొన్ని చోట్ల ఐటీఐ తరగతుల్లోకి వాన నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఇక గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. అత్యధిక ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయని తెలిపారు. స్నానాల గదులకు డోర్లు కూడా లేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. సరిపడా బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, పెడుతున్న భోజనం కూడా నాణ్యంగా ఉండటం లేదన్నారు. దిక్కులేక కారం అన్నంతో కడుపులు నింపుకుంటున్నారని చెప్పారు. వాటర్ ట్యాంకులు మురికితో పాకురు పట్టి ఉంటున్నాయని తెలిపారు. ఆ నీటినే విద్యార్థులు స్నానానికి, ఇతర అవసరాలకు వాడుతుండటంతో చర్మవ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించారు.
ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారని ప్రశ్నించారు. గురుకులాల్లో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తల్లిదండ్రులు ఎలా నమ్ముతారని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిగజారుతుండటం శోచనీయమని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన అన్ని సౌకర్యాలు వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఐటిఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం.
పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటిఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ లేక,… pic.twitter.com/JE4FFBJ7Mo
— Harish Rao Thanneeru (@BRSHarish) August 13, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

