ఎక్స్గ్రేషియా పథకాన్ని పునరుద్ధరించండి
రాష్ట్రంలో 59 ఏండ్లు పైబడిన చేనేత కార్మికులకు ఎక్స్గ్రేషియా పథకాన్ని పునరుద్ధరించాలని, టెస్కోకు ఎన్నికలు నిర్వహించాలని పద్మశాలీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
- టెసోకు ఎన్నికలు నిర్వహించాలి
- పద్మశాలీ సంఘాల డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 59 ఏండ్లు పైబడిన చేనేత కార్మికులకు ఎక్స్గ్రేషియా పథకాన్ని పునరుద్ధరించాలని, టెస్కోకు ఎన్నికలు నిర్వహించాలని పద్మశాలీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పద్మశాలీ సంఘాల నేతలు గురువారం సచివాలయంలో కలిశారు. చేనేతరంగ సమస్యలు, డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్థపు మురళి, అఖిల భారత పద్మశాలీ సంఘం సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం జాతీయ ఇన్చార్జి అవ్వారి భాసర్ మాట్లాడుతూ చేనేత వృత్తిదారులు వృద్ధాప్యంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదురొంటున్నారని తెలిపారు. గతంలో ఎక్స్గ్రేషియా పథకం అనేక చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఆ పథకాన్ని పునరుద్ధరించాలని, ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

