ధూళిమిట్ట హైస్కూల్లో ‘క్యూఆర్ కోడ్’తో హాల్‌టికెట్లు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతికత వినియోగంలో ఏమాత్రం తీసిపోరని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ధూళిమిట్ట హైస్కూల్ హెచ్ఎం కరుణాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షల విభాగం ఇన్చార్జి చిలుక వెంకటయ్య ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు రంజిత్‌కుమార్ ‘క్యూఆర్ కోడ్'తో హాల్‌టికెట్లు రూపొందించారు.
- నేటి నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 7 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతికత వినియోగంలో ఏమాత్రం తీసిపోరని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ధూళిమిట్ట హైస్కూల్ హెచ్ఎం కరుణాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షల విభాగం ఇన్చార్జి చిలుక వెంకటయ్య ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు రంజిత్‌కుమార్ ‘క్యూఆర్ కోడ్’తో హాల్‌టికెట్లు రూపొందించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి ప్రారంభం కానున్న సమ్మేటివ్ అసెస్మెంట్-2(ఎస్ఎ-2) పరీక్షల కోసం డిజిటల్ హాల్‌టికెట్లను హెచ్ఎం అందజేశారు.
స్కాన్ చేస్తే క్షణాల్లో వివరాలు..
విద్యార్థులకు ఇచ్చిన హాల్‌టికెట్‌పైన వారి వివరాలతో కూడిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఇన్విజిలేటర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి, సెక్షన్, హాల్‌టికెట్ నంబర్ తదితర వివరాలన్నీ మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతికతను అందించాలనే లక్ష్యంతో క్యూఆర్ కోడ్ విధానాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ అద్భుత ప్రయోగానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

