హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల హజ్ యాత్రికులకు శనివారం నుంచి హజ్‌హౌస్‌లో వ్యాక్సిన్లు వేయనున్నట్టు హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం వెల్లడించారు.
వ్యాక్సినేషన్, ప్రయాణ ఏర్పాట్లపై జీఎంఆర్ అధికారులతో నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శనివారం 1-1200, ఆదివారం 1201-2200, సోమవారం 2201-2400 కవర్ నంబర్ల వారికి వ్యాక్సినేషన్ ఉంటుందని వెల్లడించారు.