రాళ్లవాన బీభత్సం
తెల్లారితే ఉగాది పండుగ. పండుగ ఏర్పాట్లలో మునిగితేలిన రైతులకు అకాల వర్షం తీరని శోకం మిగిల్చింది. చేతికొచ్చిన పంటనంతా నేలరాల్చింది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
- నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన.. ఏడు మండలాల్లో అకాల వర్షం
- చేతికొచ్చిన వరి నేలపాలు .. రాలిన మామిడి, దెబ్బతిన్న కూరగాయలు
- 1200 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా
బోధన్ రూరల్/ కోటగిరి / చందూర్, ఏప్రిల్ 9 : తెల్లారితే ఉగాది పండుగ. పండుగ ఏర్పాట్లలో మునిగితేలిన రైతులకు అకాల వర్షం తీరని శోకం మిగిల్చింది. చేతికొచ్చిన పంటనంతా నేలరాల్చింది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 6 తరువాత మొదలైన వాన దాదాపు 2 గంటల పాటు దంచికొట్టింది. పొట్టకొచ్చిన వరి పంటంతా ఒరిగి వడ్లు రాలిపోయాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో మామిడికాయలు నేలరాలాయి. ‘యాడికెళ్లి వచ్చిందో మాయదారి రాళ్లవాన మా పుట్టిముంచింది’ అంటూ రైతులు కన్నీరు కారుస్తున్నారు.
జిల్లాలోని సుమారు ఏడు మండలల్లో దాదాపు 1200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. అధికారులు పంటలను పరిశీలిస్తే.. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. చందూర్ మండల కేంద్రంతోపాటు లక్ష్మాపూర్, మేడిపల్లి, లక్ష్మీసాగర్ గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కోటగిరి, పొతంగల్ మండలాల్లోని సోంపూర్, టాక్లీ, దోమలెడ్గి, వల్లభాపూర్, సుంకిని గ్రామాల్లో 600 ఎకరాల వరకు వరి పంట నేలమట్టం అయిందని అధికారులు తెలిపారు. బోధన్, సాలూర మండలాల్లో సుమారు 300ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. మందర్నలో కోతకొచ్చిన మామిడికాయలు ఈదురుగాలులు, వడగండ్లకు రాలిపోయాయి. కోటగిరి, చందూరు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి పరిశీలించి, బాధిత రైతులను ఓదార్చారు.
బిడ్డ పెండ్లెట్ల చేయాలె..
ఈ నెల 26న నా బిడ్డ పెండ్లి పెట్టుకున్న. టాక్లీ శివారులో 18ఎకరాలు కౌలు తీసుకొని వరి సాగు చేసిన. అప్పులు చేసి పంట పండించిన. పంట బాగా వచ్చింది. దిగుబడి కూడా బాగానే వస్తది అనుకున్న. ధాన్యం అమ్మిన డబ్బులతో బిడ్డ లగ్గం చేద్దామనుకున్న. మాయదారి వడగండ్ల వాన నాకు కన్నీరు మిగిల్చింది. వరి పూర్తిగా నేలకొరిగింది. గింజలన్నీ రాలిపోయాయి. ఇప్పుడు బిడ్డ పెండ్లి ఎట్లా చేయాలె.
– సాయినాథ్, రైతు, ఖాజాపూర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

