గురుకుల విద్యార్థికి పాముకాటు
ఆదిలాబాద్ ఎస్టీ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు పాముకాటుకు గురయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు ఈ నెల 22న రాత్రి వసతి గృహంలో కింద పడుకున్నాడు.
- రిమ్స్‌లో చికిత్స.. హైదరాబాద్‌కు తరలింపు
ఎదులాపురం, జూలై 24: ఆదిలాబాద్ ఎస్టీ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు పాముకాటుకు గురయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు ఈ నెల 22న రాత్రి వసతి గృహంలో కింద పడుకున్నాడు. రాత్రి సమయంలో పాము కాటు వేసింది. ఈ విషయం నిద్రలో ఉన్న విద్యార్థికి తెలియదు. 23న ఉదయం తోటి మిత్రులు నిద్ర లేపగా.. సిద్ధు కండ్లలో నుంచి నీరు కారడం, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ విషయం ఏఎన్ఎం విజయలక్ష్మికి చెప్పగా వెంటనే విద్యార్థిని ఏఎన్ఎం రిమ్స్‌కు తీసుకెళ్లింది. రిమ్స్ ఓపీ విభాగంలో వైద్యులు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. మధ్యాహ్నం విద్యార్థి బంధువు వచ్చి గ్రామానికి తీసుకెళ్లి నాటు వైద్యం చేయించారు. సాయంత్రానికి విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అ తరువాత కుటుంబ సభ్యులు రిమ్స్‌లో చేర్పించారు. ఈ విషయాన్ని ఎస్టీ గురుకులం ఆర్సీవో రాజలక్ష్మి ఎస్టీ గురుకులం ఉన్నత అధికారులకు చెప్పడంతో వారి సూచనల మేరకు బుధవారం విద్యార్థిని హైదరాబాద్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

