న్యూఢిల్లీ, జూన్ 1: టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన వినోద్ కుమార్ చౌదరి (44) మరో సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం 25.66 సెకన్లలోనే ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ను ముక్కుతో టైప్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 2023లో తాను సాధించిన రికార్డును తాజాగా తానే బద్ధలు కొట్టారు.