TGPSC | షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు.. ఏర్పాట్లు చేస్తున్న టీజీపీఎస్సీ
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 మెయిన్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నది.
- అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్.. ఆగస్టు 7, 8న గ్రూప్-2, నవంబర్ 17, 18న గ్రూప్-3 పరీక్షలనిర్వహణ
- త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు
- కసరత్తు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్
- కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు
- డిమాండ్ల సాధనకు నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నా
TGPSC | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 మెయిన్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నది.
అనంతరం గ్రూప్-1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నది. గ్రూప్-1లోని 563 పోస్టుల కోసం 4.03 లక్షల మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా, 3లక్షల మంది హాజరైనట్టు సమాచారం. ప్రిలిమ్స్ ఫలితాల్లో 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్‌కు అభ్యర్థుల ఎంపిక కొనసాగుతున్నది.
2022 లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్లో 783 ఖాళీలు ప్రకటించారు. గ్రూప్-2 పోస్టులకు ఆగస్టు 7, 8న రాతపరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18న గ్రూప్-3 పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నోటిఫికేషన్లో 1388 పోస్టులు ప్రకటించారు.
1:100 నిష్పత్తి పాటించాలి
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతుంటే, నిరుద్యోగుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. గ్రూప్-2, గ్రూప్-3లో రాత పరీక్షలు నిర్వహించలేదు. ఈలోపే గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 వరకు పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1 మెయిన్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చే యాలని కోరుతున్నారు. అదనపు పోస్టు లు పెంచాలని పేర్కొన్నారు. డిమాండ్ల సాధనకు నేడు నిరుద్యోగులు ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Group 1
- Group 3
- Group exams
- group-2
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

