1365 పోస్టులతో గ్రూప్-3.. నోటిఫికేషన్ విడుదలచేసిన టీఎస్పీఎస్సీ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా మరో శుభవార్తను ప్రకటించింది.
- స్టాఫ్ నర్సు ఉద్యోగాలు 5204
- తెలంగాణలో వరుస నియామక ప్రకటనలు
- న్యూ ఇయర్ ముంగిట నిరుద్యోగులకు తీపి కబురు
- గ్రూప్ 1,2,3,4 పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు
- జారీచేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ
- ఆర్థిక శాఖలో నే 712 పోస్టులు
- జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా మరో శుభవార్తను ప్రకటించింది. 80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో మొదలైన కొలువుల జాతరలో భాగంగా వరుసగా మూడో రోజు 6,569 పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రూప్-3లో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేయగా, వైద్యారోగ్యశాఖలో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-3 ఉద్యోగాల కోసం జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు విధించారు.
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): వరుస ఉద్యోగ ప్రకటనలతో దూసుకుపోతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. వివ రాలకు https:// www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. గ్రూప్ 3లో ఆర్థిక శాఖలోనే అత్యధికంగా 712 పోస్టులు ఉన్నాయి.
టీఎస్పీఎస్సీ రికార్డు..
టీఎస్పీఎస్సీ ఇప్పటివరకూ 17,457 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 26న 503 పోస్టులతో గ్రూప్-1 తొలి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 1న గ్రూప్-4లో భాగంగా 9,168 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఇలా.. ఇప్పటి వరకు గ్రూప్ 1, 2, 3, 4 అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసింది. 9 నెలల్లోనే ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడం కమిషన్ చరిత్రలో ఇదే తొలిసారి.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

