సూర్యపేట : సూర్యపేట జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి (Groundwater officer) మెగావత్ బాలు( Megavath Balu ) లంచం( Bribec) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ కోసనోజు వెంకటేశ్వర్లును రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
బోర్వెల్ డ్రిలింగ్కు అనుమతితో పాటు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఫిర్యాదుదారుడు అధికారులను సంప్రదించాడు. డాటా ఎంట్రీ ఆపరేటర్ మద్యవర్తిగా గ్రౌండ్ వాటర్ అధికారి బుధవారం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని ఏసీబీ అధికారులు వివరించారు.