వనపర్తి : దాదాపు 20 సంవత్సరాల తర్వాత గ్రీన్ వైన్ (Green Vine) పాము వనపర్తి పట్టణంలో కనిపించింది. ర్యాంకర్ స్కూల్ సమీపంలోని ఓ చెట్టుపై ఈ పాము కనిపించగా.. కాలనీవాసులు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ర్యాంకర్స్ స్కూల్ ప్రాంతానికి చేరుకున్న కృష్ణ సాగర్ చెట్ల కొమ్మలపైనున్న పామును గుర్తించి, పట్టుకున్నారు.
ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ గ్రీన్ వైన్ (పసిరికపాము) ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనబడుతుందని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన సర్పాలను పట్టుకున్నామని, గ్రీన్ వైన్ స్కేన్ను పట్టుకోవడం తొలిసారని తెలిపారు. తొలిసారిగా వనపర్తిలో పాము కనిపించిందని, పాము ఎక్కువగా ఆకు రంగులో కలిసి పోయి జీవిస్తాయని వివరించారు.