డాక్టర్ రఘురామ్‌కు అత్యున్నత గుర్తింపు

ఏఎస్‌జీబీఐ గౌరవ ఫెలోషిప్ అవార్డు అందజేత
భారతదేశ మొదటి సర్జన్‌గా అరుదైన ఘనత
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిమ్స్- ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామ్ అరుదైన ఘనత సాధించారు. అసోసియేషన్ ఆఫ్ ది సర్జన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ (ఏఎస్‌జీబీఐ) గౌరవ ఫెలోషిప్‌ను అందుకున్నారు. మంగళవారం వర్చువల్‌గా నిర్వహిచిన ఏఎస్‌జీబీఐ 100వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్‌లో ఆ సంస్థ అధ్యక్షుడు నీల్ వెల్చ్.. డాక్టర్ రఘురామ్‌కు గౌరవ ఫెలోషిప్ ప్రకటించారు. గడిచిన వందేండ్లలో ఈ ఫెలోషిప్‌ను అందుకున్న తొలి భారతీయుడు రఘురామ్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా నీల్ వెల్చ్ మాట్లాడుతూ.. ఈ గౌరవం అందుకున్న భారతదేశ మొదటి సర్జన్ రఘురామ్ అని కొనియాడారు. ఆయనకు ఫెలోషిప్ అందజేస్తున్నందుకు ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. ఫెలోషిప్‌ను అందుకున్న సందర్భంగా డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ.. ఇది భారతదేశానికి లభించిన గొప్ప గౌరవమని చెప్పారు. దేశవ్యాప్తంగా శస్త్రచికిత్స కళ, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నవారికి, తాను చికిత్స అందించిన రోగులకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రఘురామ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శస్త్రచికిత్సల ద్వారా సేవలందించే కొందరికే అత్యున్నత గౌరవంగా ఏఎస్‌జీబీఐ ఫెలోషిప్ అందజేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

