హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలో భాగంగా స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన గవర్నర్‌ను ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ హైటెక్‌సిటీలోని యశోద హాస్పిటల్లో చేర్చారు.
అనంతరం వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక పరీక్షలు జరిపిన తర్వాత గుండె సంబంధిత శస్త్రచికిత్స చేశారు. కాగా చికిత్స పొందుతున్న సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి అస్పత్రికి వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.