వర్సిటీలపై సమగ్ర నివేదిక ఇవ్వండి.. గవర్నర్ శివప్రతాప్ శుక్లా
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. చాన్సలర్ హోదాలో తన తక్షణ జోక్యం అవసరమైన అంశాలపై నివేదిక సమర్పించాలని సూచించారు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. చాన్సలర్ హోదాలో తన తక్షణ జోక్యం అవసరమైన అంశాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని గవర్నర్ లోక్‌భవన్‌కు పిలిపించుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వర్సిటీలవారిగా విద్య, పాలన, మౌలిక వసతుల కల్పన, ప్రొఫెసర్ల నియామకాలు, పరీక్షల నిర్వహణ, అక్రెడిటేషన్, పరిశోధన, ఆర్థిక అంశాలపై విశ్వవిద్యాలయాలవారిగా సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
యూనిఫామ్ పోస్టులకు ఐదేండ్ల సడలింపు
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : యూనిఫామ్ పోస్టుల గరిష్ఠ వయోపరిమితిని సర్కార్ సడలించింది. జీవో-87ను జారీ చేస్తూ ఐదేండ్ల సడలింపు ఇచ్చింది. ఈ సడలింపు ఏడాదిపాటు అమల్లో ఉంటుందని సర్కార్ వెల్లడించింది. దీంతో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు 39 ఏండ్ల వరకు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. రిజర్వుడు క్యాటగిరీవారికి ఆయా సడలింపులతోపాటు, ఈ ఐదేండ్లు కలిసొస్తుంది. పోలీస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, అటవీశాఖల్లోని యూనిఫామ్ పోస్టులకు ఈ ఐదేండ్ల సడలింపు వర్తిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

