భూపాలపల్లి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగంమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా, కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారంతో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు వన్ వే ఏర్పాటు చేసినా ట్రాఫిక్ జామ్ అయింది.