ఢిల్లీలో బోనమెత్తిన తెలంగాణ బిడ్డలు.. ఉత్సవాలు ప్రారంభించిన గవర్నర్
ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలను దేశ రాజధానిలో చాటిచెప్పడం అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్‌గోయల్ గవర్నర్‌ను సన్మానించారు.
మంగళవారం ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి గద్దెల ఊరేగింపు, ఘటస్థాపన నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం పోతరాజు స్వాగతం, నృత్యాలు, బంగారు బోనం ఘట్టాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శ్రీమహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని ఆరా
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసినట్టు తెలిసింది. సోమవారంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దేశ ప్రధానిని కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిద రకాల అభివృద్ధి పనుల గురించి ప్రధాని మోడీ గవర్నర్‌ను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

