గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD)లో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలు పై హరీశ్ రావు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలైన ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ, పాడి పశువుల పంపిణీ తదితర పథకాల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు.

అంతేకాకుండా పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం, రావిర్యాలలో నిర్మిస్తున్న మెగా డెయిరీ నిర్మాణ పనుల పురోగతి పై సమీక్షించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వనరులలో చేప పిల్లలు, రొయ్య పిల్లల విడుదలపై కూడా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా,మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, డెయిరీ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

