రామంతాపూర్, మే 16: హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గౌడ హా స్టల్ భవనాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం లక్షలాది మంది గీత కార్మికులు తలెత్తుకొని తిరిగే పరిస్థితిని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు.
ఏపీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంద్రభవనం లాంటి గౌడ హాస్టల్‌ను నిర్మించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్‌గౌడ్, నటుడు సుమన్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్యగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, గీత పరిశ్రమ సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజలింగం, సత్యనారాయణగౌడ్, భిక్షమయ్యగౌడ్, మా జీ మంత్రి రాజేశంగౌడ్ పాల్గొన్నారు.