ఇంటింటా వైద్య పరీక్షల కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది : బి. వినోద్ కుమార్

హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్న ఉన్నత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా వైద్య పరీక్షల బృహత్తర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వినోద్‌కుమార్ శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటింటా జరుగుతున్న వైద్య పరీక్షలను ఆరా తీశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం., ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి చాలా గొప్పదని కొనియాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అత్భుతమైన ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని తండాలు, గూడెంలు, మారుమూల కుగ్రామాల్లోనూ ప్రజల వద్దకు వెళ్లి వారి కుటుంబాల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బంది సేవలు మరువలేమన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలు క్రమం తప్పకుండా మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరాన్ని పాటించాలని, శానిటైజేషన్ సహా ఆరోగ్య నిపుణుల సూచనలను అమలు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

