Telangana Police | సంక్రాంతికి ఊరికెళ్తున్నారా..? తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తారు జాగ్రత్త!!
Telangana Police | సంక్రాంతికి సొంతూరికి వెళ్లేముందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారా? ఎప్పటిలాగే డోర్‌మ్యాట్ కింద, చెప్పుల స్టాండ్స్‌లో తాళాలు వదిలి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త అంటున్నది తెలంగాణ పోలీసు శాఖ.
- సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టకండి
- నగదు బ్యాంకు లాకర్లలో భద్రపరచండి
- ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకోవటం బెస్ట్
- సెక్యూరిటీ అలారం సెన్సార్‌తో సేఫ్
- వాచ్‌మన్‌గా నమ్మకస్తుడినే పెట్టుకోండి
- తెలంగాణ పోలీసుశాఖ హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సంక్రాంతికి సొంతూరికి వెళ్లేముందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారా? ఎప్పటిలాగే డోర్‌మ్యాట్ కింద, చెప్పుల స్టాండ్స్‌లో తాళాలు వదిలి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త అంటున్నది తెలంగాణ పోలీసు శాఖ. సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్లి మూడ్రోజుల పాటు పండుగ చేసుకుంటే.. మీకు తెలియకుండా ఇచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి పండుగ చేసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఆ సూచనలు పాటిస్తూ.. ‘పండగకు మీరు సంతోషంగా ఇండ్లకు వెళ్లండి.. అవసరమైతే మీ ఇంటికి మేము గస్తీ కాస్తాం’ అంటూ భరోసా ఇస్తున్నారు.
కర్టెన్స్‌తో కవర్ చేయండి
మెయిన్ డోర్‌కు తాళం వేస్తే.. అది కనిపించడకుండా కర్టెన్స్‌తో కవర్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేప్పుడు ఇంటి లోపల, బయట లైట్లు వేస్తే మంచిదని అంటున్నారు. ఇంటి దగ్గర నమ్మకమైన ఇరుగుపొరుగువాళ్లకు ఇంటిని గమనించాలని చెప్పండి. ఇంటికి వచ్చే, వెళ్లే దారుల్లో, ఇంటిలోపల సీసీ కెమెరాలు అమర్చుకొని డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. అల్మరా, కప్ బోర్డ్స్‌కు సంబంధించిన తాళాలు చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల కింద, అల్మరాపైన, డ్రెస్సింగ్ టేబుల్లో, కప్‌బోర్డ్స్‌లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచటం ఉత్తమమని చెప్తున్నారు. బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్లకు, గుడికి వెళ్లేప్పుడు తగు జాగ్రతలు తీసుకోవాలని, బయటికి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.
పోలీసుశాఖ సూచనలు
- ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
- సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోండి.
- మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం అమర్చుకోవడం మరీ మంచిది.
- తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి.
- మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. తప్పనిసరిగా డయల్ 100కు కాల్ చేయండి.
- మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పారు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్‌తో లాక్ వెయ్యడం మంచిది.
- నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్మెన్/ సెక్యూరిటీ గార్డ్/సర్వెంట్‌గా నియమించుకోవాలి.
- మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ ఉండాలి.
- ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్థులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

