న్యూఢిల్లీ, మే 11: దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నింటిలో సమీకృత న్యాయపరమైన డాటా అందుబాటు ద్వారా కోర్టు కేసుల నిర్వహణ వ్యవస్థ ను బలోపేతం చేసే లక్ష్యంతో సుప్రీం కోర్టు సోమవారం ‘ఒక కేసు, ఒక డాటా’ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ వ్యవస్థ తొలిసారిగా సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టు లు, తాలూకా కోర్టుల నుంచి కేసు డాటాను అనుసంధానించడానికి వీలుకల్పిస్తుందని అన్నారు. ‘హైకోర్టులు, జిల్లా కోర్టులు, ప్రభుత్వ డాటాబేస్‌తో బహుళ స్థాయి అనుసంధానం ద్వారా ఈ కోర్టు కేసుల నిర్వహణ వ్య వస్థను బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం. మొదటిసారిగా మొత్తం డాటా ఇప్పుడు ఏకీకృతం కానున్నది. సుప్రీంకోర్టులో కూర్చున్నపుడు జిల్లా కోర్టు, తాలూకా కోర్టు వరకు పూర్తి వివరాలు మాకు అందుబాటులో ఉం టాయి. తాలూకా కోర్టులకు కూడా ఇ క్కడ పూర్తి అనుసంధానం ఉంటుంది’ అని సీజేఐ తెలిపారు. డాటాను ఆటోమేటిక్ గా సేకరించడం, వివిధ న్యాయ వేదికల మధ్య కేసు సమాచారాన్ని సజావుగా ధ్రువీకరించడాన్ని సులభతరం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దే శమని సీజేఐ పేర్కొన్నారు. హైకోర్టుల కు కూడా కేసు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సు-సహాయక్ అనే సహాయక చాట్‌బాట్‌ను కూడా కోర్టు ప్రారంభించింది.