గీతం వర్సిటీలో నాలుగేండ్ల బీఈడీ.. ఈ విద్యాసంవత్సరం నుంచి పలు కొత్త కోర్సులు
కొత్తగా నాలుగేండ్ల బీఈడీ కోర్సులు రెండు ప్రవేశపెట్టినట్టు గీతం డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు వెల్లడించారు. పటాన్చెరు-రుద్రారంలోని తమ వర్సిటీలో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కోర్సుల నిర్వహణకు వర్సిటీలో కొత్తగా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను స్థాపించామని పేర్కొన్నారు.
- 28న గాట్ ప్రవేశ పరీక్ష.. 26 వరకు దరఖాస్తులు
- వెల్లడించిన వర్సిటీ అదనపు వీసీ డీఎస్ రావు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : కొత్తగా నాలుగేండ్ల బీఈడీ కోర్సులు రెండు ప్రవేశపెట్టినట్టు గీతం డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు వెల్లడించారు. పటాన్చెరు-రుద్రారంలోని తమ వర్సిటీలో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కోర్సుల నిర్వహణకు వర్సిటీలో కొత్తగా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను స్థాపించామని పేర్కొన్నారు. బుధవారం బేగంపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బోవర్ స్కూల్ ఆఫ్ అంత్రప్రెన్యూర్‌షిప్ సహకారంతో బీబీఏ (అంత్రప్రెన్యూర్‌షిప్), బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను సైతం ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టామని వెల్లడించారు.
ఎం ఫార్మా (ఇండస్ట్రియల్ ఫార్మసీ) కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందాల్సి ఉన్నదని తెలిపారు. గీతం అడ్మిషన్ టెస్ట్(గాట్) 2026 పరీక్షను ఈ నెల 28న ఆన్లైన్లో జాతీయంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 26లోపు ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారు ట్యూషన్ ఫీజు, హాస్టల్, వందశాతం స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. ప్లేస్‌మెంట్స్‌లో వర్సిటీ అనేక విజయాలు నమోదు చేసిందని, 350కి పైగా కంపెనీలతో ఒప్పందాలు కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ప్రతినిధిలు రీచాశర్మ, రమేశ్ వడ్డీ, డాక్టర్ శామ్యూల్, మమత, మోర్తాజా రెజా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

