ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
ఫిర్యాదుల పరిష్కారంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జరిపిన విచారణ రుజువు కావడంతో ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన బాలస్వామి ఫిర్యాదుల పరిష్కారంలో అవకతవకలు, భూ వివాదాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాదారం, అంకుషాపూర్, ఘట్కేసర్కు చెందిన పలువురు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
ఘట్కేసర్: ఫిర్యాదుల పరిష్కారంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జరిపిన విచారణ రుజువు కావడంతో ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన బాలస్వామి ఫిర్యాదుల పరిష్కారంలో అవకతవకలు, భూ వివాదాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాదారం, అంకుషాపూర్, ఘట్కేసర్కు చెందిన పలువురు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల వాదనలను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మరో వర్గం ఫిర్యాదుల ఆధారంగా తమపై కేసులు నమోదు చేశారనే ప్రధాన ఆరోపణలు ఇన్స్పెక్టర్ బాలస్వామి వ్యవహరశైలిపై విమర్శలకు కారణమయ్యాయి. ఇన్స్పెక్టర్ వ్యవహరశైలిపై అసంతృప్తితో ఉన్న 10 మందికి పైగా ఏసీపీ నుంచి సీపీ వరకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వివరాలు సేకరించినట్లు తెలిసింది. అనంతరం పోలీసు కమిషనర్ సుమతి ఇన్స్పెక్టర్ బాలస్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

