హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన భూములు, ఇతర స్థిరాస్తులను జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ ద్వారా సంరక్షించనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ రాలేని పరిస్థితిని తీసుకొచ్చేందుకే ఈ విధానాన్ని అనుసరించనున్నట్టు తెలిపారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీజీరాక్) సంస్థ కార్యకలాపాలపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయోగాత్మకంగా ఆర్టీసీ, హోంశాఖ భూముల కోసం జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. టీజీ రాక్ ఏడీజీ మనోహర్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ రుఫస్, నరసింహాచారి, శివప్రసాద్ పాల్గొన్నారు.