30 మందిలో ఒకరికి జన్యు సమస్యలు

- సీఎస్ఐఆర్, సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి
- పిల్లలను కనేముందు జన్యు పరీక్షలు తప్పనిసరి
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నవ దంపతులు జన్యు పరీక్షలు చేయించుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో చాలా రకాల సమస్యలను నివారించవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశంలోని ప్రతి 30 మందిలో ఒకరు జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్నట్టు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్త అధ్యయనంలో తేలింది. మేనరికం, దగ్గరి బంధువుల మధ్య వివాహాలే ఇందుకు కారణమని పేర్కొంది. చాలా కేసుల్లో జన్యులోపాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, ఆ తరువాతి తరాలకు సంక్రమించే అవకాశమున్నది. నరాల బలహీనత, క్యాన్సర్లు, సికిల్‌సెల్ అనీమియా, వెన్ను కండరాల క్షీణత తదితర వ్యాధులకు ఇది దారితీసే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో దాదాపు 7 కోట్ల నుంచి 9.60 కోట్ల మంది జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రతి ఐదువేల మందిలో ఒకరు లేదా ఇద్దరిని అరుదైన వ్యాధి బాధిస్తున్నది. జన్యువ్యాధులను నయం చేయలేకపోయినా ముందుగానే గుర్తించడం, రోగనిర్ధారణ ద్వారా వాటిని నియంత్రించవచ్చు. లేనిపక్షంలో కుటుంబంలోని తరతరాలను ప్రభావితం చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తరచుగా గర్భధారణ వైఫల్యాలు, శిశువుల్లో గుండె సంబంధింత సమస్యలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలకు జన్యులోపాలే కారణమని చెప్తున్నారు. వీటిని పూర్తిగా నివారించే చికిత్సలు లేనప్పటికీ,దాదాపు 800 రకాల జన్యు సమస్యలను ఇంజెక్షన్లు, జన్యుమార్పిడి చికిత్సతో నివారించవచ్చని పేర్కొన్నారు. రానున్న పది, పదిహేనేండ్లలో అధునాతన చికిత్సలు అందుబాటులోకొచ్చే అవకాశం ఉన్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ క్యాంపస్‌లో ఉన్న జెనిటిక్ డయాగ్నోస్టిక్ సెంటర్లో జన్యుపరమైన సమస్యలను గుర్తించే పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CCMB
- CSIR
- genetic problems
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

