ఆఫీస్ బేరర్ లెటర్ ప్లీజ్!
సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు బదిలీల నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసర్ బేరర్ లెటర్ల కోసం సంఘాల నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
- గుర్తింపు సంఘాల ఆఫీస్ బేరర్లకు బదిలీ నుంచి మినహాయింపు
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు బదిలీల నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసర్ బేరర్ లెటర్ల కోసం సంఘాల నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సర్వీస్ అసొసియేషన్ల ఆఫీస్ బేరర్లు బదిలీల మినహాయింపు పొందవచ్చు. టీఎన్జీవో, టీజీవో, డ్రైవర్స్ అసొసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, డాక్టర్స్ అసొసియేషన్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, కమర్షియల్ ట్యాక్స్, అటవీశాఖల్లోని ఉద్యోగ సంఘాలు సహా మరికొన్ని సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ఉంది. వీటికి చెందిన స్టేట్, జిల్లా, డివిజినల్, తాలుకా సంఘాల ఆఫీసు బేరర్లు మొత్తంగా రెండు పర్యాయాలు మినహాయింపును వాడుకోవచ్చు.
ఒకరు గరిష్ఠంగా 6 ఏండ్ల పాటు మినహాయింపు పొందవచ్చు. దీనిని ఆసరాగా చేసుకుని కొంత మంది అనర్హులు కీలకస్థానాల్లో తిష్టవేసేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు అప్రమత్తమయ్యారు. ఇటీవలే ఓ కీలక సంఘం సంఘ బాధ్యులకు కాకుండా ఇతరులకు లెటర్లు జారీచేస్తే క్రిమినల్కేసులు పెడతామని తమ సంఘ సభ్యులను హెచ్చరించింది. తాము కేంద్ర సంఘం స్థాయిలోను లేఖలిస్తామని, జిల్లా స్థాయిలో ఆఫీసర్ బేరర్లకు లేఖలు ఇవ్వరాదని మరో సంఘం తమ జిల్లా శాఖలకు ఖరాఖండిగా చెప్పేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

