Maheshwaram | నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కొల్లగొట్టారు.. మహేశ్వరంలో ఘటన
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎంలోని సీసీ కెమెరాలు, సైరన్ ధ్వంసం చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎంలోని సీసీ కెమెరాలు, సైరన్ ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎం మెషిన్‌ను బద్దలు కొట్టారు. డబ్బును తీసుకొని పారిపోయారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే పనిపూర్తిచేసి డబ్బు ఎత్తుకెళ్లారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి, ఏసీపీ రాజు ఏటీఎంను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితం ఏటీఎంలో రూ.30 లక్షలు పెట్టినట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

