Garlic price: ఎల్లిగడ్డ (వెల్లుల్లి) ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా రోజురోజుకు పెరిగిపోతున్నది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో మంగళవారం కిలో ఎల్లిగడ్డ ధర రూ.400 పలికింది.
ఈ ఏడాది ఎల్లిగడ్డ పంట దిగుబడి సరిగా రాకపోవడంతో ధరలు బాగా పెరుగుతున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గత రెండు నెలల నుంచి ఎల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రూ.400 దాటాయని అన్నారు. ధరలు బాగా పెరగడంతో కిలో ఎల్లిగడ్డ కొనాలనుకున్న సామాన్యుడు అరకిలతో సరిపెట్టుకుంటున్నాడు.