Garikapati | పిల్లల తిండిపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!
Garikapati Narasimha Rao | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Garikapati Narasimha Rao | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టడం, పుస్తకాలు, బట్టలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో ఆయన పాఠశాలకు వచ్చే పిల్లలను “శోభనపు పెళ్ళికొడుకులతో” పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులు చదువు కోసం కాకుండా కేవలం ఉచిత భోజనం కోసమే బడికి వస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు తమకు కావాల్సిన వస్తువులను స్వయంగా సమకూర్చుకుంటేనే వారికి చదువుపై శ్రద్ధ ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చే కోడిగుడ్ల లెక్కలు చూసుకోవడానికే ఉపాధ్యాయుల సమయం సరిపోతోందని గరికపాటి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో స్పందించిన నెటిజన్లు, గరికపాటికి పేదరికంపై కనీస అవగాహన లేదని మండిపడుతున్నారు. కనీసం ఒక పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే నిరుపేద చిన్నారులను అంత అమానవీయంగా పోల్చడం ఒక పండితుడికి తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. డ్రాపౌట్స్ తగ్గించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి మంచి పథకాన్ని కించపరచడం గరికపాటి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం,అందులో పెట్టే గుడ్డు మీద కూడా ఏడుస్తున్నాడు అంటే…ఒకటి పిచ్చి అయినా ఎక్కి ఉండాలి.. లేక అగ్రహారపు అహంకారం అయినా నెత్తికెక్కి ఉండాలి..
అభివృద్ధి చెందిన అమెరికాలోని స్కూళ్లలో కూడా పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతారు..అలాంటిది మనదేశంలో పెడితే ఇతనికొచ్చిన… pic.twitter.com/VSsX5KNoXZ
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) March 20, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

