జోగులాంబ గద్వాల జిల్లాలో ఐటీ విద్యా సంస్థ!
ఐటీ విద్యా సంస్థ | జోగులాంబ గద్వాల జిల్లాలో ఐటీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాసరలో ఏర్పాటైన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్

హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఐటీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాసరలో ఏర్పాటైన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ తరహాలో గద్వాలలో విద్యాసంస్థను నెలకొల్పనున్నారు. దీనిపై నియామకమైన నలుగురు సభ్యుల కమిటీ ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ఇటీవల గద్వాల పట్టణాన్ని సందర్శించిన కమిటీ.. విద్యాసంస్థకు అవసరమైన 70 నుంచి 75 ఎకరాల స్థలాన్ని పరిశీలించింది. ఇప్పటికే గద్వాలలో పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన పీజీ సెంటర్ ఉంది. ఈ మేరకు నలుగురు సభ్యుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో పాటు ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
ఈ విద్యాసంస్థలో బీటెక్ ( ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ) ప్రవేశపెట్టనున్నారు. పదోతరగతి తర్వాత విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈ సంస్థలో గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బాసరలోని యూనివర్సిటీలో 13 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. బయో సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, హ్యుమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మెటలార్జికల్ అండ్ మెటిరీయల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సులతో పాటు ఇతర కోర్సులో అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Basara
- gadwal
- IT institution
- RGUKT
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

