తల్లితో వివాహేతర బంధం.. ప్రియురాలి అల్లుడిని హత్య చేసిన బ్యాంకు మేనేజర్
ఏపీలోని కర్నూల్ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్‌కు చెందిన ప్రవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32) ను దారుణంగా హత్య చేశాడు.
గద్వాల : ఏపీలోని కర్నూల్ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్‌కు చెందిన ప్రవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32) ను దారుణంగా హత్య చేశాడు. బ్యాంకు మేనేజర్ ప్రియురాలి బిడ్డను తేజేశ్వర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తేజేశ్వర్ హత్య జరిగింది.
తిరుమలరావు కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన, కల్లూరుకు చెందిన మహిళతో అతడికి అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో గద్వాలకు చెందిన గంట తేజేశ్వర్.. సదరు మహిళ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అమ్మాయి తల్లికిగానీ, ఆమె ప్రియుడైన బ్యాంకు మేనేజర్‌గానీ నచ్చలేదు.
దాంతో గంట తేజేశ్వర్‌ను ఎలాగైనా హతమార్చాలని ఇద్దరూ కుట్రపన్నారు. అతడు ప్రైవేట్ సర్వేయర్ కావడంతో భూమి సర్వే పేరుతో రప్పించి హత్య చేయాలని పథకం వేశారు. అనుకున్న ప్రకారం కర్నూలులో తేజశ్వర్కు పరిచయం ఉన్నవారితో ఫోన్ చేయించి, ల్యాండ్ సర్వే పేరు చెప్పి రమ్మన్నారు. నమ్మి వచ్చిన తేజేశ్వర్‌ను బ్యాంకు మేనేజర్ హత్యచేశాడు.
ఐదు రోజులైనా తేజేశ్వర్ జాడ కనిపించకపోవడంతో అతని అన్న తేజవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో తేజేశ్వర్ తప్పిపోయినట్లు కేసు నమోదైంది. గద్వాల ఎస్పీ ప్రత్యేక బృందంతో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. శనివారం రాత్రి గద్వాల పోలీసులు కర్నూలుకు వచ్చి కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్య సహకారంతో విచారించారు.
ఈ క్రమంలో పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు దగ్గరలో తేజేశ్వర్ మృతదేహాన్ని పోలీసులు మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా గుర్తించారు. పాణ్యం పోలీసుల సహాయంతో ఆ మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలో బ్యాంకు మేనేజర్‌తోపాటు మరికొందరి హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని గద్వాల ఎస్సై కళ్యాణ్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

