గచ్చిబౌలి స్టేడియం ఆధునీకరణకు రూ. 52 కోట్లు ఇవ్వండి : ఎంపీ రంజిత్‌రెడ్డి

హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలి క్రీడాప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడానికి రూ.52 కోట్లు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. 90 ఎకరాలున్న ఈ స్టేడియం అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్, ఔట్‌డోర్ క్రీడలు నిర్వహించేందుకు అనుకూలమని పేర్కొన్నారు.
గతంలో ఇక్కడ 32వ జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్ నిర్వహించారని చెప్పారు. ఒలింపిక్స్ రజిత పతక విజేత పీవీ సింధు ఈ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేశారని, దీనిని ఆధునికీకరించడం వల్ల మరికొంతమంది అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగేందుకు తోడ్పుడుతుందని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

