కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలిస్తేనే నిధులు
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ గ్రామాలకు అభివృద్ధి నిధులు ఇస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో గీసుగొండ, సంగెం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, నామినేషన్లు వేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
- కోడ్ ఉల్లంఘించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి
గీసుగొండ, డిసెంబర్ 3 : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ గ్రామాలకు అభివృద్ధి నిధులు ఇస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో గీసుగొండ, సంగెం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, నామినేషన్లు వేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 109 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తన వద్దకు తీసుకురావాలని పార్టీ ముఖ్య నాయకులకు సూచించారు. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల నాయకులు కోరుతున్నారు.
కొండెంగను తెచ్చిన.. ఓట్లేయండి
- మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వినూత్న ప్రచారం
దండేపల్లి, డిసెంబర్3 : ‘కోతుల బెడద నుంచి కాపాడేందుకు కొండముచ్చును తీసుకొచ్చిన. ఇక మీకెలాంటి బాధ లేదు. మీ ఓట్లు మాత్రం నాకే వేయాలి’ అంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వర్ వినూత్న ప్రచారానికి తెరలేపాడు. కోతుల బెడద తట్టుకోలేకపోతున్నామని, ఈ సమస్య పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టంచేయడంతో సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వర్ కోతుల బెడదను తీర్చడానికి ప్రత్యేక వాహనంలో కొండెంగను తీసుకొచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

