హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మెడికల్ కోర్సుల్లో సీట్లు రానివారంతా ఫార్మసీ కోర్సుల వైపు మళ్లుతున్నారు. దీంతో ఫార్మసీ కోర్సులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఇంటర్ బైపీసీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులంతా ఇప్పుడు బీ ఫార్మసీ కోర్సుల్లో చేరుతున్నారు.
బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఎంసెట్(బైపీసీ) తుది విడత సీట్లను మంగళవారం కేటాయించారు. ఈ ఏడాది ఎంసెట్(బైపీసీ) కౌన్సెలింగ్లో అన్ని కోర్సుల్లో 97% సీట్లు నిండాయి.