హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని ఆశించే ఎస్సీ, ఎస్టీ యువతకు ఐబీపీఎస్ పరీక్షలకు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గిరిజన సంక్షేమశాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 10 చొప్పున మొత్తం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 28వ తేదీలోగా <http://studycircle. cgg.gov. in> వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నది.
టీచర్ల బదిలీలు చేపట్టాలి: దామోదర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీలు, పదోన్నతులను జూలైలో చేపట్టాలని తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ పుల్గం దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జనగణన ముగిసిన తర్వాత జూలైలో బదిలీలు చేపట్టాలని కోరారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(జాక్టో) చైర్మన్ జీ సదానందంగౌడ్, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధి సీహెచ్ రవితో కలిసి శనివారం సచివాలయంలో విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ పుల్లారావును కలిసి బదిలీలు, పదోన్నతులపై వినతిపత్రం సమర్పించారు.