హైదరాబాద్, జనవరి 16 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని బీసీ స్టడీసర్కిళ్లలో ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9వతేదీలోగా tgbcstudycircle.cag.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించవద్దని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15 నుంచి వంద రోజులపాటు కోచింగ్ ఉంటుందని వెల్లడించారు.