తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరులో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 రోజులుగా నడుస్తున్నటెట్ ఉచిత శిబిరం ఆదివారంతో ముగిసింది. శిక్షణ తీసుకున్న పలువురు అభ్యర్థులు ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి ఉషాదయాకర్‌రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు, పాలకుర్తి కేంద్రాలుగా ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఉద్యోగార్థుల కోసం టెట్, పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ., గ్రూప్స్ కోసం తొర్రూరు కేంద్రంగా ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్‌తో సమన్వయం చేసి ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నది. ఇందులో భాగంగా తొర్రూరులో 60 రోజులు 300 మందికి ఉచితంగా టెట్ కోచింగ్ ఇప్పించారు. అభ్యర్థులకు ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం పెడుతూ, మెటీరియల్ ఇచ్చి ఉచితంగా శిక్షణ ఇప్పించారు. ఆదివారంతో శిక్షణ ముగిసింది. తమకు ఉచితంగా శిక్షణ ఇప్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సతీమణి ఉషాదయాకర్‌రావుకు జీవితాంతం రుణపడి ఉంటామని అభ్యర్థులు తెలిపారు.