పేదల కడుపునింపేందుకే ఉచిత బియ్యం
మంత్రి గంగుల.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ప్రారంభం

కొత్తపల్లి, జూన్ 5: కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్లకార్డు ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఓ రేషన్‌షాపులో గంగుల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించి మాట్లాడా రు. రాష్ట్రంలో 53.56లక్షల కార్డులకు రెండు నెలల కోసం కేంద్రం ఉచితంగా అందించే పది కిలోల బియ్యంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలను కార్డుదారులకు ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. సుమారు 2.80కోట్ల మందికి 4.31లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్టు తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం సుమారు రూ.92 కోట్లను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ నెల 20వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

