Accident | వేములవాడ వెళ్తుండగా కారును ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం
హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండలంలోని పెంచికల్‌పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
హనుమకొండ: హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండలంలోని పెంచికల్‌పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, జేసీబీ సాయంతో కారులో ఇరుక్కుపోయిన వారిని అతికష్టంమీద బయటకు తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను మంతెన కాంతయ్య, శంకర్, భరత్, చందనగా గుర్తించారు. వారంతా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందినవారని, వేములవాడకు (Vemulawada) వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మంచు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఏటూరునాగారంలో తీవ్ర విషాదం అలముకొన్నది.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

