Swaroopanandendra swamy | కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి.. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు కోతలు, నీటికొరత లాంటి సమస్యలెన్నో తెలంగాణను వెంటాడుతాయని అంతా భావించారని, కానీ సీఎం కేసీఆర్ చతురతతో, రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా అచిరకాలంలోనే వాటన్నింటినీ అధిగమించారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు.
- కోకాపేటలో రాజశ్యామల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
Swaroopanandendra swamy | మణికొండ, మే 7: రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు కోతలు, నీటికొరత లాంటి సమస్యలెన్నో తెలంగాణను వెంటాడుతాయని అంతా భావించారని, కానీ సీఎం కేసీఆర్ చతురతతో, రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా అచిరకాలంలోనే వాటన్నింటినీ అధిగమించారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం పీఠం ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర స్వామీజీతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. దాదాపు 8 కోట్ల వ్యయంతో కాకయతీయు ల శిల్పకలా నైపుణ్యంతో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకోనున్నది.
తెలంగాణలో రాజశ్యామల అమ్మవారు ఆవిర్భవించాలనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ తమ పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, కంపెనీస్ లా ట్రిబ్యునల్ న్యాయమూర్తి బద్రీనాథ్, ఫొన్సిక్స్ ప్రతినిధి చుక్కపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

