హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. యా దాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కా ర్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడి ని ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ఎల్కతుర్తి, జనవరి 12 : ఇందిర మ్మ రాజ్యం అంటే ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడులు చేయడమేనా? అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.