Narender Reddy | మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా? : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Patnam Narender Reddy | కారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాల(Kommuru school) విద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గర చేసి వెళ్తున్నారు.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాల(Kommuru school) విద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గర చేసి వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)హుటా హటిన కొమ్మూర్ గ్రామంలోని పాఠశాలకు చేరుకుని తనిఖీ చేశారు. బియ్యం నిల్వ గదిని పరిశీలించగా పురుగులు పట్టిన బియ్యం దర్శనం ఇచ్చాయి.
సీఎం సొంత సొంత నియోజకవర్గంలోనే విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్లా ఎలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు, నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదింటి పిల్లలు తినే తిండిపై సర్కారుకు చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

