హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తేతెలంగాణ): మావోయిస్టుల ఏరివేత పేరిట దండకారణ్యంలో కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండను ఆపివేయాలని అంధోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. వెంటనే చర్చలు జరిపి హింసకు స్వస్తి చెప్పాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. పోలీసు బలగాల చేతిలో తెలుగు బిడ్డలు పిట్టల్లా రాలుతున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనేక దేశాలు పరస్పర చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటున్నాయని, ఈ సమస్యను కూడా చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు. రెండు నెలల్లోనే కేంద్రం వందలాది మంది అడవి బిడ్డలను పొట్టనబెట్టుకోవడం ఆందోళన కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.