కొడకండ్ల, ఫిబ్రవరి 9 : జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ మోహన్ గాంధీనాయక్ చేపట్టిన దీక్ష ఆదివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా గాంధీనాయక్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసేవరకు పోరాటం చేస్తానని చెప్పారు. గాంధీనాయక్ దీక్షకు వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
మాదిగలకు 15శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ;సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను 17శాతానికి పెంచి మాదిగలకు 15శాతం కోటా ఇవ్వాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ 30ఏండ్ల పోరా ట ఫలితంగానే మాదిగలు, మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వం నేతకాని వర్గీయుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని సవరించాలని కోరారు.