హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మాజీ డీపీహెచ్ గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో జాయింట్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్న ఆయనను మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (ఏడీపీహెచ్‌వో)గా నియమించింది. మరో ముగ్గురు ఏడీపీహెచ్వోలను కూడా బదిలీ చేస్తూ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.
జనగామ ఏడీపీహెచ్‌వో ధన్‌రాజ్‌ను సిద్దిపేటకు, సిద్దిపేటకు చెందిన మనోహర్‌ను యాదాద్రి భువనగిరికి, నిర్మల్‌కు చెందిన మల్లికార్జునరావును జనగామకు బదిలీ చేశారు. గడల శ్రీనివాసరావు వీఆర్ఎస్కు దరఖాస్తు చేయగా, ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో ఆయన తిరిగి ఉద్యోగంలో చేరతారా? లేదా? అనే ఆసక్తి నెలకొన్నది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వం బదిలీలపై నిషేధం విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.