హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): లగచర్ల భూసేకరణపై మాట మార్చిన సీఎం రేవంత్రెడ్డి.. పచ్చి అబద్ధాల కోరు అని డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది సీఎం రేవంత్రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందే ఫార్మా విలేజ్ కోసమని… ఇప్పుడు కాదని బొంకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.