దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి.. కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30తో పీఆర్సీ గడువు ముగుస్తున్నందున సీఎం రేవంత్చొరవ తీసుకుని నివేదిక తెప్పించుకోకపోతే మరో ఏడాది గడిచినా ఉద్యోగులకు పీఆర్సీ అందదని ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30తో పీఆర్సీ గడువు ముగుస్తున్నందున సీఎం రేవంత్చొరవ తీసుకుని నివేదిక తెప్పించుకోకపోతే మరో ఏడాది గడిచినా ఉద్యోగులకు పీఆర్సీ అందదని ఆందోళన వ్యక్తంచేశారు. గడువు పొడిగిస్తూ పోతే ఉద్యోగులు రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అధ్యయన కమిటీ వేస్తామని చెప్పడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
రూ.10వేల కోట్లు ఏమయ్యాయి?..
ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లోని రూ.10 వేల కోట్లు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై స్పష్టత లేకపోవడంతో వారు రోడ్డున పడే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆదాయంలో సగం ఉద్యోగులకే పోతున్నదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఖజానా నుంచి ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్నది 38 శాతమేనని దేవీప్రసాద్ స్పష్టంచేశారు. ఉద్యోగులను చులకన చేసేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్‌కార్డులను దవాఖానలు పట్టించుకోవడం లేదని, ఓపీ సేవలను వెల్నెస్ సెంటర్లకు అప్పగించి ఒక నిమ్స్ దవాఖానకే పరిమితం చేయడం దారుణమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రస్తావిస్తూ.. గతంలో కమిటీలు 29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే కేసీఆర్ ఏకంగా 43 శాతం ఇచ్చారని గుర్తుచేశారు. సమావేశంలో ఎస్టీఎఫ్ మాజీ అధ్యక్షుడు భుజంగరావు, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

